రష్యా- ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఆ దేశ కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. రష్యాపై ఉక్రెయిన్ దాడి చేయడానికి అమెరికా ఆయుధాలను వినియోగించేందుకు జో బైడెన్ అనుమతించారు. ఈ నిర్ణయాన్ని తప్పు పట్టిన ట్రంప్.. అధికారం చేపట్టిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకుంటానని పేర్కొన్నారు. బైడెన్ ఈ నిర్ణయం తీసుకునే ముందు తన యంత్రాంగాన్ని సంప్రదించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.