రోజూ కూల్ డ్రింక్స్ తాగితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. సరదాగా స్నేహితులతో కలిసినప్పుడు, ఎండ వేడిని తట్టుకోలేక, ఎదైన పని చేసి అలసిపోయినప్పుడు ఇలా రకరకాల కారణాలతో డ్రింక్స్ తాగుతుంటారు. కానీ, దీంతో లివర్ దెబ్బతినడంతో పాటు, షుగర్, గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ ఉందట. సాఫ్ట్ డ్రింక్, డైట్ సోడా కూడా డేంజర్ అంటున్నారు.