ఆరోగ్యకరమైన చర్మం కోసం ఓట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై మురికిని, మృతకణాలను తొలగించి సహజమైన మెరుపును ఇస్తాయి. ఓట్స్ పొడిని పాలు లేదా పెరుగుతో కలిపి ఫేస్ ప్యాక్‌గా వేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది. ఇది మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. ఓట్స్ పేస్ట్‌కు తేనె కలిపి ముఖానికి రాస్తే చర్మ రంధ్రాల్లోని మురికి తొలగి, ముఖం కాంతివంతమవుతుంది.