AP: భారత వైద్య సాంకేతిక రంగానికి చేయూతనిచ్చేందుకు వీలుగా ఏపీ మెడ్‌టెక్ జోన్, మెడ్ఆర్తా క్యాపిటల్ భాగస్వామ్యంతో ప్రత్యేక మెడ్‌టెక్ క్యాపిటల్ నిధిని ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ముంబైలో ఫండ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ.. మెడ్‌టెక్ రంగంలో ఆవిష్కరణలు, అంకుర సంస్థలకు ఈ నిధి దోహదపడుతుందన్నారు.