TG: కామారెడ్డిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లా కేంద్రంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుతో పాటు చుట్టుపక్కల 7 మండలాల యువత, మహిళలకి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.