వేసవిలో లభించే మల్బరీ పండ్లు పోషకాల గని. వీటిలోని విటమిన్ C, K, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియకు తోడ్పడటమే కాకుండా రక్తహీనత, కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. విటమిన్ A కంటి చూపును మెరుగుపరిస్తే, క్యాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతుంది.