AP: ‘ప్రజలు ముందు’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలను సమన్వయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రం కళ తప్పిందని.. గత ప్రభుత్వం సృష్టించిన సమస్యలను తనెప్పుడూ చూడలేదని చెప్పారు. అన్ని చిక్కుముడులేనని.. ఒక్కోచిక్కుముడిని వదిలించుకుంటున్నామన్నారు. ఇప్పుడు హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ అవసరమని వెల్లడించారు.