AP: సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. పరిపాలనా భవనాల నిర్మాణంపై చర్చించారు. శాఖలవారీ ఉద్యోగుల మేరకు వర్క్ స్పేస్ కేటాయింపుపై చర్చించామని మంత్రి నారాయణ తెలిపారు. తొలుత 31.71 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్ అంచనా వేశామని.. శాఖలవారీగా ఉద్యోగుల వివరాలపై స్పష్టత ఇవ్వాలని CSను కోరినట్లు చెప్పారు. వర్క్ స్పేస్‌పై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.