TG: HYDలో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలపై సీపీ సజ్జనార్ స్పందించారు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ‘పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా అని గుడ్డిగా నమ్మొద్దు. అబ్బాయి ప్రవర్తన, స్నేహితులు, అలవాట్లపై ఆరా తీయండి. పెళ్లికి ముందే కలవడానికి, శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే అనుమానించండి. డబ్బు డిమాండ్, బ్లాక్ మెయిల్ చేసినా భయపడవద్దు. ఫిర్యాదు చేయండి’ అని చెప్పుకొచ్చారు.