TG: భూదాన్ భూముల్లో 720 కుటుంబాలు ఉంటున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ‘అందులో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుంది. గత ప్రభుత్వం 2023లో కొన్ని ఇళ్లు కూల్చింది. ఈ నెల 15లోపు పేదలకు ఇళ్ల స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తాం. గత పదేళ్లు మీరు ఎందుకు ఇళ్లు ఇవ్వలేదు. రెచ్చగొట్టే మాటలు మానుకోవాలి’ అని పేర్కొన్నారు.