పావురాళ్ల విసర్జన, వాటి రెక్కల నుంచి రాలే ధూళి వల్ల హైపర్ సెన్సిటివిటీ న్యుమోనైటిస్ వంటి తీవ్ర శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. వీటి రెక్కలలోని ప్రోటీన్లు, విసర్జనలోని శిలీంధ్రాలు ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. నిరంతరం వీటి మధ్య ఉండటం వల్ల దగ్గు, ఆయాసం, అలర్జీలు సంభవిస్తాయి. అందుకే నివాస ప్రాంతాల్లో పావురాళ్లు చేరకుండా జాగ్రత్త వహించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.