మూఢనమ్మకంతో బతికున్న కోడిపిల్లను ఓ వ్యక్తి మింగిన ఘటన ఛత్తీస్‌గఢ్ అంబికాపూర్‌లో జరిగింది. అది కాస్త గొంతులో ఇరుక్కోవడంతో ఆ వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. తండ్రి కావాలనే కోరికతో ఆనంద్ అనే వ్యక్తి ఓ తాంత్రికుడిని ఆశ్రయించాడు. అతడి సలహా మేరకు కోడిపిల్లను మింగడంతో ఊపిరాడక కుప్పకూలిపోయాడు. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.