గాజాలో హమాస్ చెరలోని బందీలను విడిపించడానికి కుదిరే ఒప్పందం చివరి దశలో ఉందని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఈ విషయాన్ని కనెస్సెట్ చట్ట సభ్యులకు ఆ దేశ రక్షణ మంత్రి కాట్జ్ తెలిపారు. కనెస్సెట్ విదేశాంగ, రక్షణ కమిటీలతో నిర్వహించిన రహస్య సమావేశంలో కాట్జ్ పేర్కొన్నారు. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ విషయంపై ఇదివరకే మాట్లాడినట్లు తెలుస్తోంది.