AP: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పనితీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష జరిపారు. పార్టీ దృష్టికి వచ్చిన విషయాలపై ఎమ్మెల్యేను పవన్ వివరణ కోరారు. వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులను 4 వారాల్లో చక్కదిద్దుకోవాలని సూచించారు. ఈ క్రమంలో వ్యక్తిగత విషయాలు సరిదిద్దుకునేందుకు ఎమ్మెల్యే కొంత గడువు కోరారు. నియోజకవర్గానికి ఇచ్చిన రూ.147 కోట్ల పనుల పురోగతిపై ఆరా తీశారు.