TG: రాష్ట్ర ప్రభుత్వం MSMEల కోసం ‘రెవెన్యూ ఆధారిత ఫైనాన్సింగ్’ పథకాన్ని తెచ్చింది. ఇకపై ఆస్తుల పూచీకత్తు లేకుండానే భవిష్యత్ అమ్మకాల ఆధారంగా రుణాలు పొందవచ్చు. ఈ గేమ్‌ఛేంజర్ పాలసీ చిన్న పరిశ్రమలు, స్టార్టప్‌లకు ఊరటనివ్వనుంది. పారదర్శకత పెంచడంతో పాటు ఆర్థిక కష్టాలను తీర్చడమే ఈ సరికొత్త పారిశ్రామిక విధానం ప్రధాన లక్ష్యం.