TG: రెండు లక్షల లోపు రుణమాఫీ అందరికీ జరగడం లేదని CPI రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. టెక్నికల్ సమస్యలు ఉన్నాయని అంటున్నారు.. వాటిని పరిష్కరించి రుణమాఫీ అయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమీ కొత్తగా లేదని అభిప్రాయపడ్డారు. విద్యా రంగానికి 14 శాతం నిధులు అడిగితే.. 8 శాతం మాత్రమే కేటాయించారని అన్నారు.