TG: YS రాజశేఖర్ రెడ్డిని ఎదిరించానని పవన్ కళ్యాణ్ చెప్పడం సరికాదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లవచ్చని, గతంలో తాను తెలంగాణకు వెళ్లినప్పుడు ఎవరూ ఆపలేదని గుర్తుచేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనుకుంటే ఎక్కడైనా అనుమతులు నిరాకరిస్తారని, ఆంధ్రా నేతల విగ్రహాలను తొలగిస్తామనడం తగదని బొత్స హితవు పలికారు.