TG: గ్రూప్-2 పరీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు గురించి ప్రశ్నలు అడగటంపై మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. ‘తెలంగాణ చరిత్ర, పోరాటం చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. అది పేపర్ మీద చేసిన సంతకం కాదు.. కాలం మీద చేసిన సంతకం.. ఉద్యమ చరిత్ర చెరిపేయాలనే కాంగ్రెస్ కుటిల యత్నాలను తెలంగాణ సమాజం గుర్తించింది. ప్రజలే కాంగ్రెస్కు బుద్ధి చెబుతారు’ అంటూ మండిపడ్డారు.