TG: రాష్ట్ర రాజకీయాలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ వీడడంతో చర్చనీయాంశంగా మారింది. జీవన్ రెడ్డి ఇప్పటికే BRS అధినేత KCRను కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగిత్యాలలో ఈనెల 20న సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ బహిరంగసభ నిర్వహించనున్నారు. కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.