ముస్లింలకు UP పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ట్రాఫిక్‌కు, ప్రజలకు ఇబ్బంది కలిగేలా రోడ్లపై నమాజ్ చేయొద్దన్నారు. రోడ్లపై నమాజ్ చేసిన వారి పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ‘ఈద్ ప్రార్థనలను మసీదులు లేదా ఈద్గాల్లోనే చేయాలి. రోడ్లపై చేసేందుకు ఎవరికీ అనుమతి లేదు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.