AP: హెరిటేజ్ సంస్థకు రూ.59.69 కోట్ల భారీ రాయితీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 57 విడుదల చేసింది. ఇందులో టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌కు రూ.34.93 కోట్లు, ఐదేళ్ల పాటు 100 శాతం జీఎస్టీ రీయింబర్స్మెంట్(రూ.17.80 కోట్లు), విద్యుత్ ఛార్జీల్లో యూనిట్‌కు రూపాయి రాయితీ(2 కోట్లు) ఉన్నాయి. 35 మందికి ఉద్యోగాలిస్తున్నందుకు గానూ ఈ స్థాయి లబ్ధి చేకూరనుంది.