కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI) పరిధిలో 7,072 అవినీతి కేసుల విచారణ పెండింగ్లో ఉన్నట్లు కేంద్ర నిఘా కమిషన్(సీవీసీ) వార్షిక నివేదిక తెలిపింది. దీనిలో 379 కేసులు 20 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్నాయి. అదే మూడేళ్లలోపు 1506 కేసులు, 3-5 ఏళ్ల లోపు 791 కేసులు, 5-10 ఏళ్లలోపు 2,115 కేసులు, పదేళ్లకు పైగా 2,281 కేసులు పెండింగ్లో ఉన్నట్లు సీవీసీ వెల్లడించింది.