W.G: ఏపీ సీపీఎస్సీఈఏ ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దు కోరుతూ ఇవాళ చలో విజయవాడ ధర్నాకి ఉద్యోగులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం నుంచి విజయవాడలో జరుగుతున్న చలో విజయవాడ ధర్నాకి ఉద్యోగులు తరలి వెళ్లారు. ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేయాలని ఏపీ సీపీయస్ఈఏ రాష్ట్ర కార్యదర్శి ఆర్.నాగ దుర్గారావు కోరారు.