KDP: జమ్మలమడుగులో నారాపుర వెంకటేశ్వర స్వామి దేవాలయ పవిత్రోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా నేడు సాయంత్రం అంకురార్పణ చేస్తారు. మంగళవారం అగ్ని పవిత్ర ప్రతిష్ఠ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బుధవారం పవిత్ర సమర్పణ, గురువారం పూర్ణహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.