KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వరుసగా మూడు రోజులు సెలవు ప్రకటించారు. మిలాద్-ఉన్-నబీ సందర్భంగా శుక్రవారం, అలాగే వారాంతపు సెలవులైన శని,ఆదివారాలు (సెప్టెంబర్ 5,6,7)మార్కెట్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. సోమవారం,సెప్టెంబర్ 8వ తేదీన మార్కెట్ యథావిధిగా తెరుచుకుంటుందని మార్కెట్ కార్యదర్శి తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.