కోనసీమ: ప్రేమ, సోదర భావం, ధర్మచింతన ప్రతి మానవునిలోనూ ఉండాలని చెప్పిన మహమ్మద్ ప్రవక్త బోధనలు అనుసరణీయమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. శుక్రవారం కొత్తపేట మసీదులో జరిగిన మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దివ్య ఖురాన్ బోధనలతో మానవాళిని ప్రభావితం చేసిన మహోన్నత వ్యక్తి మహమ్మద్ ప్రవక్తని వ్యాఖ్యానించారు.