SKLM: పలాస నియోజకవర్గంలోని మందస, పలాస పాఠశాల మౌలిక వసతులకు రూ.77.45 లక్షలు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే గౌతు శిరీష చెప్పారు. శుక్రవారం ఓ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. పలాస మండలంలో 9 బడులకు, మందసలో 2 పాఠశాలకు ప్రహరీ గోడలు, మరుగుదొడ్ల నిర్మాణాలకు ఈ నిధులు కేటాయించామన్నారు. కూటమి పాలనలో పాఠశాలల అభివృద్ధికి పెద్ద పీట వేయడం జరగుతుందని స్పష్టం చేశారు.