ఈనెల 7న(ఆదివారం) రాత్రి 9:56 గంటల నుంచి అర్ధరాత్రి 1:26 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ‘గ్రహణం సమయంలో గర్భిణులు దర్భలను తమ దగ్గర పెట్టుకోవాలి. అలాగే సాయంత్రం 6 లోపు ఆహారం తీసుకోవాలి. గ్రహణానికి ముందు, తర్వాత తల స్నానం చేయాలి. ఆహార వస్తువులు, పూజ గదిలో దర్భలను వేయాలి’ అని పండితులు చెబుతున్నారు.