KNR: శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన సోమిరెడ్డి తిరుపతి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారన్న సమాచారంతో కాచాపూర్ గ్రామ శివారులో ట్రాక్టర్ను పట్టుకున్నామని ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తుండడంతో కేశవపట్నం పోలీస్ స్టేషన్కు ట్రాక్టర్ను తరలించామని చెప్పారు. సోమిరెడ్డి తిరుపతిపై కేసు నమోదు చేశామన్నారు.