NGKL: చారకొండ మండలంలోని ప్రాథమిక పాఠశాలకు ఆదనపు గదులు, వంటగది మంజూరు చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణకు ఉపాధ్యాయులు ఈరోజు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు, నాణ్యమైన విద్యకు ఆకర్షితులైన తల్లిదండ్రులు విద్యార్థులను భారీగా చేర్పించారన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.