HYD: వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు జలమండలి MD అశోక్ రెడ్డి తెలిపారు. రేపు గణేష్ నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో డైరెక్టర్లు, CGMలు, GMలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 123 ప్రత్యేక తాగునీటి శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 35 లక్షల వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.