TG: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీమంత్రి KTR డిమాండ్ చేశారు. బాన్సువాడకు చెందిన కాంగ్రెస్ నాయకులు KTR సమక్షంలో BRSలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోచారం MLA పదవి పోయేవరకు న్యాయపోరాటం కొనసాగిస్తామన్నారు. 21 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రజావ్యతిరేకత మూటగట్టుకుందన్నారు. CM పరిపాలనపై దృష్టిపెట్టకుండా పదే పదే KCR పేరునే ప్రస్తావిస్తున్నారని విమర్శించారు.