ప్రకాశం: టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా కారు దగ్ధమైంది. ఈ మేరకు శుక్రవారం నెల్లూరు నుంచి ఒంగోలుకు వెళుతున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కాగా, అప్రమత్తంగా వ్యవహరిస్తూ కారు డ్రైవరు వెంటనే కారు రోడ్డు పక్కన ఆపివేశారు. కారు యజమానితో పాటు అతని భార్య మరియు కుమారుడు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.