SRCL: అక్రమంగా బెల్ట్ షాపును నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామని తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. తంగళ్ళపల్లి మండలం తాడూరులోని చర్లపల్లి అమరేందర్ ఇంటిని తనిఖీ చేయగా రూ 7750 విలువగల మద్యం బాటిల్స్ దొరికాయని తెలిపారు. దొరికిన మద్యం బాటిల్లను సీజ్ చేసి బెల్ట్ షాపు నిర్వహిస్తున్న అమరేందర్పై కేసు నమోదు చేసామన్నారు.