SRD: నాగలిగిద్ద మండలం లష్కర్ తండా ప్రాథమిక పాఠశాల సింగిల్ టీచర్ అరుణ డివిజన్ స్థాయిలో ఉత్తమ టీచరుగా ఇవాళ అవార్డు అందుకున్నారు. ఆమె ఉపాధ్యాయ వృత్తిలో చేరిన 10 నెలలకే ఆమె వృత్తి నైపుణ్యతను చాటింది. 5 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ఇప్పుడు 25 మంది పిల్లలకు సంఖ్య పెంచి గ్రామంలో అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉత్తమ అవార్డు దక్కడం ఆనందంగా ఉందని తెలిపారు.