AP: CM చంద్రబాబు అనుకున్నంత పనీచేశారని మాజీ సీఎం జగన్ ‘X’ వేదికగా పోస్ట్ చేశారు. ‘చంద్రబాబు సంపద సృష్టిస్తానని చెప్పి.. ప్రజల ఆస్తులను కమీషన్ల కోసం దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిన్న కేబినెట్లో ప్రైవేటు పరం చేయడం అవినీతిలో వారి బరితెగింపునకు నిదర్శనం. మేం అధికారంలోకి రాగానే ఈ నిర్ణయాన్ని రద్దు చేస్తాం’ అని తెలిపారు.