SKLM :నరసన్నపేటలో బంగారం వ్యాపారి వెంకట పార్వతీశం హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో పట్టణంలో వర్తకులు వ్యాపార నిమిత్తం పొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్తున్న తరుణంలో పరిస్థితి ఏమవుతుందోనని భయాందోళన చెందుతున్నారు. మిస్సింగ్ కేసుగా నమోదై ఇవాళ శ్రీకాకుళంలోని పెద్దపాడు వద్ద డెడ్‌బాడీ పోలీసులకు లభించింది. సొంత డ్రైవర్ మరికొందరితో కలిసి ఈ హత్య చేశాడని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.