HNK: కాజీపేట మండలం మడికొండలో చల్ల చెరువులో వినాయక నిమజ్జనం ప్రక్రియ కొనసాగుతుంది. విశాల విస్తీర్ణంలో ఉన్న చెరువు నిండుకుండగా మారడంతో శుక్రవారం డీజిల్ కాలోని ,మధుబన్ కాలనీ నుంచి గణనాథులను నిమజ్జనం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మున్సిపాలిటీ తరఫున క్రేన్లతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మడికొండ సీఐ కిషన్ నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.