విశాఖలోని జిల్లా కోర్టు హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2016లో కృష్ణను దుర్గారావు కత్తితో మెడ మీద పొడిచి తీవ్రంగా గాయపరచడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తులో నేరం రుజువు కావడంతో జిల్లా అడిషనల్ జడ్జ్ సీ.కే గాయత్రీ దేవి దుర్గారావుకు జీవిత ఖైదు విధిస్తూ బుధవారం తీర్పు నిచ్చింది.