E.G: మండల కేంద్రమైన చాగల్లులో బుధవారం రాత్రి ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఎన్డీఏ కూటమి విఫలమైందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.