W.G: ద్వారక తిరుమల మండలం సూర్యచంద్రరావుపేటకు చెందిన అశోక్ (23) పాము కాటుకు గురై మృతి చెందాడు. అశోక్ పొలం పనులు చేస్తూ తల్లిదండ్రులతో జీవిస్తున్నాడు. బుధవారం పోలం పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వస్తున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు. బంధువులు అతన్ని భీమడోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.