SRPT: కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాల్లో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి నుంచి మొదలైన వర్షం తెల్లవారుజాము వరకు మోస్తారుగా పడింది. తెల్లవారు సమయంలో పెద్ద ఎత్తున ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో పలు మండలాల్లో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి.