SRD: నారాయణఖేడ్ పట్టణంలోని తాసిల్ మైదానంలో ఈనెల 11, 12న జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. 11న బాలికలు, 12న బాలుర అండర్-14, 17 పోటీలు జరుగుతాయని చెప్పారు. మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు మాత్రమే హాజరుకావాలని పేర్కొన్నారు.