VSP: ఆనందపురం సబ్ స్టేషన్ పరిధిలోని ఆనందపురం, పెద్దిపాలెం, బోని ఫీడర్లలో నిర్వహణ పనుల కారణంగా గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది. ఈ కారణంగా వేములవలస, లొడగలవానిపాలెం, ఆనందపురం, సత్య కల్యాణ అపార్ట్మెంట్, బంటుపల్లి కళ్లాలు, వెల్లంకి, పెద్దిపాలెం, పొడుగు పాలెం, చందక ప్రాంతాలకు కరెంటు ఉండదన్నారు.