KNR: శంకరపట్నం మండలం తాటికల్ ZPHSలో బీజేపీ మండలాధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో మోదీ కానుకగా పదో తరగతి చదువుతున్న 27 మంది విద్యార్థులకు ఆదివారం సైకిళ్లను పంపిణీ చేశారు. టెన్త్ బాలబాలికలకు రవాణా ఇబ్బంది ఉండకూడదనే సదుద్దేశంతో సైకిళ్లను అందించినట్లు అనిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాడ వెంకట్ రెడ్డి, దొంగల రాముడు, రాసమల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.