MBNR: వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్లో కాచిగూడ-చెంగల్గట్టు, కాచిగూడ-పుదుచ్చేరితోపాటు మరికొన్ని సూపర్ ఫాస్ట్ రైళ్లను ఆపాలని ఎంపీ డీకే.అరుణ రైల్వే అధికారులను కోరారు. గద్వాలలో వందే భారత్ రైలు ఆగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ రైల్వే స్టేషన్లో చెన్నై-ముంబై రైలు ఆపాలని ఆమె విజ్ఞప్తి చేశారు.