కోనసీమ: అమలాపురం డిపో నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వెళ్లే ఏసీ బస్సుల్లో టికెట్ ఛార్జీలపై 10 నుంచి 15 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి రాఘవ కుమార్ బుధవారం తెలిపారు. ఈ రాయితీ అమరావతి, నైట్ రైడర్, ఇంద్ర సర్వీసులకు వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ వరకు ఈ అవకాశం ఉంటుందని రాఘవ కుమార్ వివరించారు.