WGL: వినాయక నిమజ్జనం సందర్భంగా వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై-సీటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్రైత్ సింగ్ తెలిపారు. శోభాయాత్ర, విగ్రహాల నిమజ్జనానికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ఆంక్షలు విధించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు గురువారం ఉదయం నుంచి సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు.