ELR: జంగారెడ్డిగూడెం మండలంలోని మైసన్నగూడెం గ్రామంలో రోడ్డు పనులు సగం సగం చేసి ఆపేశారు. రెండు వైపులా సిమెంట్ రోడ్డు వేసి, మధ్యలో మట్టి రోడ్డు వదిలేయడంతో వర్షాలకు అది బురదమయంగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సరైన ప్రణాళిక లేకుండా ఇలా అరకొరగా పనులు ఎందుకు చేశారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.