ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనంతపురంలోని 9వ డివిజన్ పరిధిలోని భవాని నగర్లో ఇవాళ పర్యటించారు. కొడవగానిపల్లి ఎస్సీ కాలనీలో ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి ప్రతినెలా పింఛన్ సక్రమంగా అందుతోందా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీలో పర్యటించి సమస్యలపై ఆరా తీశారు.